Monday, May 6, 2024

రూ.5వేల కోట్ల విలువైన చైనా ప్రాజెక్టులకు మహారాష్ట్ర బ్రేక్

- Advertisement -
- Advertisement -

Uddhav Thackeray suspended proposed 3 projects with China

 

ముంబయి : లడక్‌లోని గల్వాన్ లోయలో చైనా దురాగతంపై మహారాష్ట్ర సర్కార్ కన్నెర్ర చేసింది. చైనాతో ప్రతిపాదిత 3 ప్రాజెక్టులను ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.5,000 కోట్లు. ఇటీవల ముంబైలో జరిగిన‘మేగ్నటిక్ మహరాష్ట్ర 2.0’ ఇన్వెస్టర్ మీట్‌లో చైనా కంపెనీలతో ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి సంతకాలు జరిగాయి. లడక్ ఘర్షణలకు కొద్ది రోజులకు ముందే ఈ ఇన్వెస్టర్ మీట్ జరిగింది. కేంద్రంతో సంప్రదించిన అనంతరమే మూడు ప్రాజెక్టుల సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టులను నిలిపి ఉంచామని, కేంద్రం నుంచి తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News