Friday, May 3, 2024

రాష్ట్రంలో భారీగా 872 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

730 New Corona Cases Reported in Telangana

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 713, రంగారెడ్డి 107 మేడ్చల్ 16, సంగారెడ్డి జిల్లాలో 12
ఏడుగురు మృతి, మరణించిన వారిలో వైద్యుడు, పోలీసు అధికారి
అమీర్‌పేట కార్పొరేటర్‌కు కొవిడ్ పాజిటివ్
మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో 9 మందికి
భువనగిరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వైరస్
ప్యాట్నీ సెంటర్ ఎస్‌బిఐలో ఏడుగురికి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెర్రర్ సృష్టిస్తుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు రావడంతో ప్రజల్లో టెన్షన్ పట్టుకుంది. కొత్తగా ఏకంగా 872 కేసులు నమోదుకాగా, ఏడుగురు వ్యక్తులు మరణించారు. సోమవారం మరణించిన వారిలో ఖైరతాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్ అనే వైద్యుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన తొలి వైద్యుడు కూడా ఇతనేనని అధికారులు చెప్పారు. అయితే ఈనెల 16న జ్వరంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరగా, 18వ తేదిన ఈ వైద్యుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వయస్సు ఎక్కువ ఉండటంతో వైరస్ దాడిలో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇతని ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

డా. జ్ఞానేశ్వర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా మెంబర్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైద్యం అందించే ఓ డాక్టర్ చనిపోవడంతో మిగతా వారిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో పాటు కాలాపత్తర్ పోలీస్టేషన్‌లో పనిచేసే ఏఎస్‌ఐ యూసఫ్ కూడా మృతిచెందారు. దీంతో ఆ స్టేషన్‌లో సిబ్బందిని క్వారంటైన్ చేశామని అధికారులు తెలిపారు. అదే విధంగా కొత్తగా వైరస్ సోకిన వారిలో అమీర్‌పేట్ కార్పొరేటర్ శేషుకుమారీ ఉన్నట్లు తెలిసింది. దీంతో అమె కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రతి రోజూ కేసులు అంతకుఅంతకు పెరుగుతుండటంతో అధికారులకు కూడా టెన్షన్ పట్టుకుంది. రోజువారీగా రికార్డు స్థాయిలో నమోదవుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

కొత్తగా 872 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలతో పాటు అధికారుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇవే గరిష్ఠం కావడం గమనార్హం. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 713 పాజిటివ్ తేలింది. గ్రేటర్ పరిధిలో ఒక్క రోజులో నమోదైన కేసుల్లోనూ ఇవే గరిష్ఠం.దీంతో పాటు రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 107 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మిగతా జిల్లాల్లో 52 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో చనిపోయిన ఏడుగురు వ్యక్తులు వివరాలు తెలియపరచలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8674 కి చేరగా, ఇప్పటి వరకు ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 4005కి పెరిగింది.

అదే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4452 కి చేరుకుంది. వైరస్ దాడిలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 217కి పెరిగింది. సోమవారం వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 713 మంది ఉండగా, రంగారెడ్డిలో 107, మేడ్చల్ 16, మంచిర్యాల 5, సంగారెడ్డి 12, వరంగల్ అర్బన్ 1, వరంగల్ రూరల్ 6, జనగాం 2, కరీంనగర్ 2, మహబూబాబాద్ 2, కామారెడ్డి 3, మెదక్‌లో ముగ్గురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో భూవనగిరిలో ఓ సాప్ట్‌వేర్ ఉద్యొగికి వైరస్ తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ ఎస్‌బిఐ బ్యాంక్‌లో పనిచేసే ఏడుగురు సిబ్బందికీ వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు.

మలక్‌పేట్ ఏరియా ఆసుపత్రిలో 9 మందికి కరోనా…
మలక్‌పేట్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న 15 మంది వైద్యసిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 9 మందికి వైరస్ సోకినట్లు సూపరింటెండెంట్ డా బద్రినాథ్ తెలిపారు. అయితే వైరస్ సోకినవారందరినీ గాంధీకి తరలించినట్లు తెలిపారు. ఆ క్రమంలో రెండు రోజుల పాటు ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

872 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News