Friday, May 10, 2024

పీవోకేలో పాక్‌ బ్రిటన్ హైకమిషనర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇస్లామాబాద్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఇస్లామాబాద్ లోని బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియంట్ ఈ నెల 10న బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారితో కలిసి పీవోకేలో పర్యటించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ ప్రకటన వెలువరించింది. “ ఇది భారత్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే అవుతుందని, ఇది ఆమోదయోగ్యం కాదని, ఎల్లవేళలా భారత్‌లో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ సమగ్రభాగాలని ” పేర్కొంది.

దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్‌మోహన్ క్వాత్రా భారత్ లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు తన అసమ్మతిని తెలియజేశారు. బ్రిటన్ హైకమిషనర్ జాన్ మారియట్ ఈనెల 10న పీవోకే లో కేంద్ర స్థానమైన మిర్‌పూర్‌ను సందర్శించారు. “ బ్రిటన్, పాకిస్థాన్ పౌరుల మధ్య సంబంధాలకు గుండెకాయ వంటి మిర్పూర్‌కు సలాం. 70 శాతం బ్రిటన్ పాకిస్థానీయుల మూలాలు మిర్పూర్ నుంచే వచ్చాయి. ప్రవాసుల ప్రయోజనాల కోసం మిమ్మల్ని కలిసేలా చేస్తోంది. మీ ఆతిధ్యానికి ధన్యవాదాలు ” అంటూ మారియట్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News