Tuesday, May 14, 2024

యుకెలో దీపావళి నుంచి ‘లక్ష్మీబార్’

- Advertisement -
- Advertisement -
UK Royal Mint Releases Lakshmi Gold Bar
బంగారు ఆభరణాల అమ్మకం:  రాయల్‌మింట్
ఒక్కో బార్ ధర 1080 పౌండ్లు

లండన్: యుకెలో విలువైన లోహాలను డిజైన్ చేసి అమ్మడంలో పేరున్న రాయల్‌మింట్ మొదటిసారిగా ఈ ఏడాది దీపావళి నుంచి 20 గ్రాముల బంగారు‘లక్ష్మీబార్’ లను అమ్మాలని నిర్ణయించింది. సంపదకు మారుపేరుగా హిందువులు ఆరాధించే లక్ష్మీదేవి చిత్రంతో ఈ బంగారు ఆభరణాన్ని రూపొందించింది. రిటైల్‌గా ఒక్కో బార్ ధరను 1080 పౌండ్లుగా నిర్ణయించింది. లక్ష్మీబార్‌ను రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మానోబుల్ రూపొందించారు. కార్డిఫ్‌లోని శ్రీస్వామినారాయణ్ ఆలయం నిర్వాహకుల్లో ఒకరైన నీలేశ్‌కబారియాతో కలిసి ఈ బార్‌ను రూపొందించారు.

సంప్రదాయాన్ని, అందాన్నీ మిళితం చేసి ఈ గోల్డ్‌బార్‌ను రూపొందించామని రాయల్‌మింట్ డివిజనల్ డైరెక్టర్ ఆండ్య్రూడికీ తెలిపారు. ఓం సింబల్‌తో అందంగా ప్యాక్ చేసిన లక్ష్మీబార్‌ను రాయల్‌మింట్ వెబ్‌సైట్‌లో పెట్టారు. కమలంపై నాలుగు చేతులతో నిల్చున్న లేదా కూర్చున్న లక్ష్మీదేవిని ఈ గోల్డ్‌బార్‌పై ముద్రించారు. నవంబర్ 4న దీపావళి రోజున లక్ష్మీపూజతో సంప్రదాయికంగా లక్ష్మీబార్‌ల అమ్మకాలను ప్రారంభిస్తామని మింట్ నిర్వాహకులు తెలిపారు. ఆరేళ్ల క్రితం బంగారు నాణేలను ముద్రించడం ప్రారంభించిన రాయల్‌మింట్ ఇప్పుడు యుకెలో విలువైన లోహాల డిజైనింగ్‌లో ప్రసిద్ధి గాంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News