Sunday, April 28, 2024

తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం

- Advertisement -
- Advertisement -

UNDP

 

రాష్ట్రానికియుఎన్‌డిపి కితాబు

హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్

తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్‌డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంకును సాధించింది. మొత్తం 82 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో 75 మార్కులు ఉండగా 7 మార్కులు పెంచుకోవడం విశేషం. దేశీయ తలసరి ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిరుద్యోగ రేటు, లేబర్ ఫోర్స్ పార్టిషిపేషన్ రేటు, లక్ష మంది అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ ఔట్‌లెట్స్, కుటుంబ బ్యాంకు ఖాతాల సంఖ్య, మహిళల బ్యాంకు ఖాతాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని స్థిరమైన ఆర్థిక వృద్ధి, పనితీరులో తెలంగాణకు అగ్రస్థానాన్ని నీతి ఆయోగ్ ప్రకటించింది.

హైదరాబాద్ : సమిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సాహించడంలో, పనితీరులో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబర్చిందని యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కితాబిచ్చింది. ఈ మేరకు సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన 2019 ఇండెక్స్ రిపోర్ట్‌ను ప్రస్తావించింది. దీనిపై బుధవారం యుఎన్‌డిపి ఇండియా ట్వీట్ చేయగా, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారక రా మారావు దానికి స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. అధ్బుతమైన వార్త. యుఎన్‌డిపి ప్రకారం తెలంగాణ బాగా పనిచేస్తుందని వినడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇం డెక్స్ రిపోర్ట్ ప్రకారం మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంకును సాధించింది. మొ త్తం 82 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. 20 18లో 75 మార్కులు ఉండగా 7 మార్కు లు పెంచుకోవడం విశేషం.

దేశీయ తలసరి ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిరుద్యోగ రేటు, లేబర్ ఫోర్స్ పార్టిషిపేషన్ రేటు, లక్ష మంది అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ ఔట్‌లెట్స్, కుటుం బ బ్యాంకు ఖాతాల సంఖ్య, మహిళల బ్యాంకు ఖా తాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని స్థిరమైన ఆర్థిక వృద్ధి, పనితీరులో తెలంగాణకు టాప్ ప్లేస్‌ను నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ అంశంలో మిగతా రాష్ట్రాలను చూస్తే తెలంగాణ తరువాత ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు 78 మార్కులు, హిమచల్ ప్రదేశ్‌కు 76 మార్కులు, గుజరాత్ 75, తమిళనాడుకు 74, ఉత్తరాఖండ్ 73, పశ్చిమ బెంగాల్ 72 మార్కులు, గోవా, హర్యానాలకు 71 మార్కులు వచ్చాయి. జార్ఖండ్, మహారాష్ట్రాలకు 70 మార్కులు రాగా, సిక్కిం 68, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్‌కు 67 మార్కులు, మేఘలాయ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు 65 మార్కుల చొప్పున, బీహార్, యుపిలకు 64 మార్కులు, త్రిపుర 63, కేరళ 61, ఒడిస్సా 59, అ రుణాచల్ ప్రదేశ్52, మిజోరం42, నాగాలాండ్28 మార్కులు వచ్చాయి.

UNDP Praise to Telangana state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News