Wednesday, May 1, 2024

స్ట్రీట్‌వెండర్లకు యూనియన్ బ్యాంక్ రుణాలు

- Advertisement -
- Advertisement -

Union Bank loans to street vendors

 

మన తెలంగాణ/హైదరాబాద్: యూనియన్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా శనివారం జంటనగరాలు, తెలంగాణలోని ఇతర పట్టణాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పిఎం స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు(స్ట్రీట్‌వెండరు)రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామంతపూర్ శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపులో సంజయ్ కుమార్, ఐఎఎస్ పాల్గొని లబ్ధిదారులనుద్దేశించి ప్రసంగించారు. రామంతపూర్ శాఖలో 203 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్ శంకరయ్య, బ్యాంకు ఉన్నతాధికారులు హుస్సేన్, శ్రీనివాస్, పద్మావతి, ఓబుల్ రెడ్డి, కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం అమలులో బ్యాంకు పనితీరును ప్రశంసించిన వక్తలు లబ్ధిదారులు బ్యాంకు అందిస్తున్న సదుపాయాన్ని, ప్రభుత్వంనుంచి లభిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో రుణాలు చెల్లించి తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News