Thursday, May 2, 2024

నానితో బాలయ్య రచ్చ రచ్చ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ చేస్తున్న షో ‘అన్‌స్టాప‌బుల్ విత్ యన్‌బికె’. ఈ షోలో బాలయ్య తన డైలాగులతోపాటు కావల్సినంత ఎంటర్ టైన్మెంట్ తో అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ మోహన్ బాబా, విష్ణు, లక్ష్మీతో బాలయ్య తనదైన శైలిలో చేసిన సందడి ప్రేక్షకులను అలరించింది. ఇక, రెండో ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నానితో కలిసి బాలయ్య సరదా మాటలు, డైలాగులతో రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబందించిన ప్రోమో ఇప్పటికే విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో సందడి చేయనుంది.

 

UNSTOPPABLE With NBK 2nd Episode Promo

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News