Wednesday, May 15, 2024

సమంతది నిజమైన ప్రేమ: ఉపాసన

- Advertisement -
- Advertisement -

Upasana and Samantha
హైదరాబాద్: నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసనకు, నాగచైతన్య ఎక్స్ వైఫ్ సమంతకు మధ్య గాఢమైన స్నేహం ఉంది. ఫిట్‌నెస్, ఆరోగ్యం, మహిళా శక్తి వంటి విషయాలపై వారి ఆలోచన ధోరణి ఒకే రీతిలో ఉంటుంది. ఉపాసన గతంలో నిర్వహించిన యువర్‌లైఫ్.కో.ఇన్ వెబ్‌సైట్‌కు సమంత గెస్ట్ ఎడిటర్‌గా కూడా వ్యవహరించింది. దీని గురించి ఉపాసన ఇటీవ ఓ ఇంటర్వూలో వెల్లడించింది.
“నేను తెలంగాణ బిడ్డను. దసరా వంటి పండుగల సమయంలో కూడా మాంసం తింటాను. అయితే సమంత ఆర్టికల్స్ ఎడిట్ చేసిన తర్వాత మాంసం తినడం చాలా వరకు తగ్గించాను. సమంతకు సాయం చేసే గుణం ఉంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకూ సాయం చేసింది. సమంతది నిజమైన ప్రేమ” అని ఉపాసన పేర్కొంది. ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News