Thursday, May 2, 2024

ట్రంప్ మాటే నిజమైంది

- Advertisement -
- Advertisement -

donald trump

వాషింగ్టన్: కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది. అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణా లు కోల్పోయిన వారి సంఖ్య లక్షదాటేసింది. ‘కరోనా ధాటికి 75 లేదా 80 వేలనుంచి లక్ష మంది ప్రజలను మనం పోగొట్టుకోబోతున్నాం’ అని ట్రంప్ ఈ నెల మొదటివారంలో వ్యాఖ్యానించారు. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కారణంగా 1,00,572 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. మొత్తం 17,25,275 కేసులు నమోదైనాయి.

కాగా, కోవిడ్19 బారిన పడిన వారిలో 4,79,969 మంది కోలుకున్నారు. దేశంలో చనిపోయిన వారిలో మూడో వంతు దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్, దాని పొరుగు రాష్ట్రాలైన న్యూజెర్సీ, కరెక్టికట్‌లలోనే చోటు చేసుకున్నా యి. కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా కోలుకోని దెబ్బ తీసింది. దీని ఫలితంగా ఆర్థి క వ్యవస్థ కనీవినీ ఎరుగని మాంద్యంలోకి జారుకోగా, గత మూడు నెలల్లో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కోల్పోయారు.

అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మరణాలతో పాటుగా కొత్తగా కేసులు నమోదు కావడం తగ్గుతుండడం తో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను సడలించి క్రమేపీ ఆర్థిక వ్యవస్థలను తెరవడం మొదలు పెట్టాయి. మృతి చెందిన వారిలో సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వారున్నారని, తమ ప్రియతములను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు వారి కోసం రోదిస్తూనే ఉన్నారని మృతు సంఖ్య లక్ష దాటినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సి టీ ప్రకటించిన తర్వాత అమెరికా ప్రతినిధుల సభ లో మెజారిటీ నాయకుడు స్టెనీహోయర్ తెలిపారు.

చైనానుంచి అందిన చెడ్డ బహుమతి: ట్రంప్

కరోనావైరస్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఇచ్చిన అత్యంత చెడ్డ బహుమతిగా అభివర్ణించారు. అమెరికాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య లక్షకు చేరుకున్న సందర్భం గా ట్విట్టర్‌లో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఈ వ్యాఖలు చేశారు. ‘కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరుకోవడంతో మనం ఓ దారుణమైన మైలురాయికి ఇప్పుడే చేరుకున్నాం. మృతి చెందిన వారి కుటుం బ సభ్యులు, మిత్రులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్రంప్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

US Covid 19 death toll nears 1 lakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News