Sunday, April 28, 2024

కరోనా రోగులు కోలుకున్న 9 నెలల తర్వాత టీకా

- Advertisement -
- Advertisement -

Vaccination 9 months after Corona Patients recovered

ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు

న్యూఢిల్లీ : కరోనా రోగులు వైరస్ నుంచి కోలుకున్నాక నాలుగు నుంచి ఎనిమిది వారాల తరువాత కొవిడ్ టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు వ్యవధి మరింత పెరిగితే శరీరంలో యాంటీబాడీలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్ ఇప్పుడు తొమ్మిది నెలల తరువాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని సిఫార్సు చేస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా వైరస్ నుంచి కోలుకున్న తరువాత ఆరు నెలలకు తొలి టీకా తీసుకుంటే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. వ్యాక్సినేషన్ విధానంపై ఎన్‌టిఎజిఐ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే. బాలింతలు, గర్భిణులు టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మొదటి డోసు తీసుకున్నాక కరోనా బారిన పడితే కోలుకున్నాక 4 నుంచి 8 వారాలు వేచి ఉండి, తరువాత రోండో డోసు వేయించుకోవచ్చునని తెలిపింది. ప్లాస్మా చికిత్స చేయించుకున్నవారైతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మూడు నెలలకు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలని ఈ ప్యానెల్ సిఫార్సు చేయగా, కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News