Saturday, April 27, 2024

కరోనాతో కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ కార్డియాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కెకె అగర్వాల్ కరోనా వైరస్ కాటుకు బలయ్యారు. ఇటీవల కాలంలో కొవిడ్ మహమ్మారికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో వీడియోల ద్వారా ప్రజలకు అందించి మంచి పేరు సంపాదించుకున్న డాక్టర్ అగర్వాల్ అదే కరోనాకు బలి కావడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
62 సంవత్సరాల డాక్టర్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఇక్కడి అఖిల భారత వద్యై శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లో చేరారు. గత వారం రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన ట్విటర్ ఖాతాలో ఆయన కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) మాజీ అధ్యక్షుడైన డాక్టర్ అగర్వాల్‌కు భార్య డాక్టర్ వీణా అగర్వాల్, కుమారుడు నీలేష్, కుమార్తె నైనా ఉన్నారు. డాక్టర్ అగర్వాల్ మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు.

Cardiologist Dr KK Agarwal died of Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News