Wednesday, May 8, 2024

నేటి నుంచి ప్రైవేటు టీకా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా పంపిణీ
17 సిజెహెచ్‌ఎస్, 12 ఆయుష్మాన్ ఆసుపత్రులలోనూ…
ప్రభుత్వ ఆసుపత్రులలోనూ పెరగనున్న టీకా సెంటర్లు
సర్వీస్ ఛార్జి లేకుండా కేవలం డోసు ధరనే తీసుకోనున్న ప్రైవేటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 215 ప్రైవేట్ ఆసుపత్రులలో టీకా పంపిణీ జరగనుంది. దీంతో పాటు 17 సిజిహెచ్‌ఎస్, 12 ఆయూష్మాన్ హాస్పిటల్స్‌లో వ్యాక్సినేషన్ జరగనుంది. అదే విధంగా ప్రభుత్వాసుపత్రుల్లోనూ క్రమంగా సెంటర్లను పెంచుతున్నామని అధికారులు తెలిపారు. అయితే వీటిలో ఆన్‌లైన్‌తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరగనుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో టీకా ప్రారంభమైన విషయం విధితమే. అయితే ఒక్కో డోసు ధర రూ.150తో పాటు రూ.100 మించకుండా సర్వీస్ చార్జీ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించినప్పటికీ, హైదరాబాద్‌లోని యశోదా, అపోలో, విరుంచి హాస్పిటల్స్ కేవలం డోసుల ధరలను మాత్రమే తీసుకోవడం గొప్ప విషయం. ప్రజలకు హెల్ప్ చేయడమే తమ ధ్యేయమని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పుకొస్తున్నాయి. వీటితో పాటు మరిన్ని హాస్పిటల్స్ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో ఈనెల 23 వరకు వ్యాక్సినేషన్ సెషన్స్ బ్లాక్ అయ్యాయని సమాచారం. అంటే వ్యాక్సినేషన్‌కు ఆధరణ పెరుగుతుందని అధికారులు అంటున్నారు.
రాష్ట్రం వ్యాప్తంగా వ్యాక్సినేషన్2 లో 51,48,184 మందికి టీకాలు ఇవ్వనున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 5,90,807 మంది ఉండగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 39,420 మంది ఉన్నారు. అదే విధంగా ఆదిలాబాద్‌లో 1,04,026 మంది ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం 1,65,004, జగిత్యాల 1,37,020, భూపాలపల్లి 60,228, గద్వాల 87,100, కామారెడ్డి 1,37,410, కరీంనగర్‌లో 1,43,000, ఖమ్మం 1,95,910, ఆసిఫాబాద్ 74,759, మహబూబాబాద్ 1,02,782, మహబూబ్‌నగర్ 1,27,290, మంచిర్యాల 1,05,108, మెదక్ 99,766, మేడ్చల్ మల్కాజ్‌గిరి 5,08,820, నాగర్ కర్నూల్ 1,21,550, నల్గొండ 2,26,590, నారాయణపేట్ 83,021, నిర్మల్ 95,748, నిజామాబాద్ 2,11,190, పెద్దపల్లి 1,04,000, సిరిసిల్లా 72,339, రంగారెడ్డి 4,14,180, సంగారెడ్డి 2,27,890, సిద్ధిపేట్ 1,31,568, సూర్యాపేట్ 1,44,935, వికారాబాద్ 1,26,434, వనపర్తి 81,500, వరంగల్ రూరల్ 96,460, వరంగల్ అర్బన్‌లో 1,55,220, యాదాద్రి భువనగిరిలో1,03,480 మంది ఉన్నట్లు అధికారులు జాబితాను తయారు చేశారు. వీరందరికి కేవలం నాలుగు నెలల్లో రెండు డోసులను పూర్తి చేయాలని వైద్యశాఖ లక్షం పెట్టుకుంది. ఇప్పటికే వారం పాటు టీకా పొందే లబ్ధిదారుల సంఖ్యకనుగుణంగా జిల్లాలకు డోసులకు కూడా పంపిణీ చేశారు. అంతేగాక మరిన్ని డోసులకు ఆర్డర్ కూడా పెట్టినట్లు ఆరోగ్యశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈమేరకు హెల్త్‌డిపార్ట్‌మెంట్ ప్రత్యేక నివేదికను మంగళవారం ప్రభుత్వానికి అందజేసింది.
ఆ ఐదు జిల్లాల్లోనే అత్యధికం….
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిరిసిల్లా, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 60 ఏళ్ల వారు 4,54,467 ఉండగా, 45 నుంచి 59 ఏళ్ల వారిలో 1,36,340 మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు. అదే విధంగా మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 3,91,400 వృద్ధులు ఉండగా 45 నుంచి 59 ఏళ్ల వారిలో 1,17,420 మంది ఉన్నారు. సిరిసిల్లాలో 3,18,600 మంది వృద్ధులు ఉండగా, 95,580 దీర్ఘకాలిక రోగులు ఉన్నారు. సంగారెడ్డిలో 1,75,300 వృద్ధులు ఉండగా, 52,590 దీర్ఘకాలిక రోగులు, నాగర్ కర్నూల్‌లో 1,74,390 మంది ఉండగా, 52,290 మంది దీర్ఘకాలిక రోగులు బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Vaccine drive in 215 private hospitals across Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News