Sunday, April 28, 2024

‘ఆపరేషన్ వాలెంటైన్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ లో ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోంది. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ నటిస్తున్నారు. సినీ ప్రేక్షకులకు గొప్ప సినిమా అనుభూతిని కల్పిస్తామని నిర్మాతలు ఇటీవల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పుడు మోషన్ టీజర్‌తో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్‌లపై సందీప్ ముద్దా నిర్మించారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News