Thursday, May 2, 2024

రాజస్థాన్‌లో ‘ రాజే’కీయం..

- Advertisement -
- Advertisement -

జైపూర్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో ఇప్పుడు వెలువడ్డ ఓ ఫోటో రాజకీయ వేడిని రగిల్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌తో కలిసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకురాలు వసుంధరా రాజే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ప్రచారం పొందింది. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఈ పరిణామం ఉప్పు నిప్పు కలయిక మాదిరిగా ఉందని కామెంట్లు వెలువడుతున్నాయి. శుక్రవారం రాత్రి జైపూర్‌లో ‘ కానిస్టూషన్ క్లబ్ ఆఫ్ రాజస్థాన్ ప్రారంభోత్సవం జరిగింది. వేదికపై సిఎంతో కలిసి వసుంధరా రాజే ఎక్కడా కన్పించలేదు. అయితే ఆమె ఆ తరువాత విడిగా సిఎం గెహ్లోట్‌తో సమావేశం అయినట్లు. కొద్ది సేపు మాట్లాడినట్లు ఫోటోలతో వార్త వెలువడింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోబిజెపి కార్యక్రమాలకు వసుంధరా రాజే దూరంగా ఉంటున్నారు.

ఢిల్లీ బిజెపి నేతల ఆధ్వర్యంలో చేపట్టిన పరివర్తన్ యాత్రలో ఆమెకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దీనితో బిజెపి అధిష్టానం తీరుపట్ల ఆమె కోపంగా ఉన్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ దశలోనే తమ సమఉజ్జీ అయిన గెహ్లోట్‌తో ఆమె భేటీ ప్రాధాన్యత వహించింది. దీని తరువాత వెలువడ్డ వార్తలపై వసుంధరా రాజే కార్యాలయం స్పందించింది. కానిస్టూషన్ క్లబ్ కార్యక్రమం తరువాత వసుంధర రాజే, స్పీకర్ డాక్టర్ సిపి జోషి, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోర్ కలిసి కొద్ది సేపు మాట్లాడుకున్నారని, సంబంధిత ఫోటోను వెలువరించారు. రాజే ఒక్కరే గెహ్లోట్‌ను కలిశారనే ఫోటోలు వెలువడ్డాయని ఎటువంటి వివరణ లేకుండా నిజం తెలిపారు. అయితే స్పీకర్, ప్రతిపక్ష నేతతో కలిసి వసుంధర రాజస్థాన్ సిఎంను ఎందుకు కలిసినట్లు? ఏదో ఉండే ఉంటుందని మరింత బలంగా వార్తలు వెలువడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News