Sunday, May 5, 2024

మార్కెటింగ్‌శాఖ చొరవతో దిగివచ్చిన కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

Vegetable

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి సంవత్సరం వేసవి ఉష్ణోగ్రతలతో పాటు అంతకు అంత పెరిగిపోతుంటాయి.దాంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుంటాయి. లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో కూరగాయల ధరలు మరీ అధికంగా ఉండేవి. కాని మార్కెటింగ్ శాఖ అధికారులు అందరికి అందుబాటులో ఉండే విధంగా కూరగాయల ధరలను నియంత్రించడమే కాకుండా అందరి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్ చేసిన ప్రారంభంలో కిలో టమాట రూ.50 నుంచి 70 అమ్ముడు పోయింది. ఆకుకూరల ధరలను లాక్‌డౌన్ పేరుతో ఒక కట్టను రూ.10 నుంచి 15 వరకు అమ్మడు పోయింది. ఈ పరిస్థితిని గ్రహించిన అధికారులు ధరలు అధికంగా అమ్మేవ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించారు. దానిలో భాగంగా కొంత మంది వ్యాపారుల లైసెన్స్‌లను కూడా రద్దు చేశారు.

అధికారులు ప్రత్యేకంగా రంగంలోకి దిగి కూరగాయలను ధరలను అదుపులోకి తీసుకు రావడంతో రైతుబజార్లలో కిలో టమాట ప్రస్తుతం కిలో రూ.9 లభిస్తోంది. అంతే కాకుండా లాక్‌డౌన్ పరిస్ధితుల్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నగరంలోని 12 రైతు ( బోయినపల్లి, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మెహదీపట్నం, ఫలక్‌నుమా, సరూర్‌నగర్, వనస్థలిపురం, అల్వాల్, మేడిపల్లి, ఎల్లమ్మబండ ,ఆర్కేపురం) బజార్ల ద్వారా ఇళ్ళ ముందుకే 300 సంచార రైతుబజార్లను ఏర్పాటు చేసి నగర వ్యాప్తంగా 500 ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా ఫోన్ కాకుండా సంబంధిత రైతుబజార్లకు ఫోన్ చేసి కూడా తమకు కావాల్సిన కూరగాయలను తెప్పించు కోవచ్చు. గత సంవత్సరం ఇదే సమయానికి రైతు బజార్లలోని కూరగాయల ధరలు…

ప్రస్తుతం రైతుబజార్లోని కూరగాయల ధరలు (2020 ఏప్రిల్)                              గత సంవత్సరం( 2019 ఎప్రిల్ )

టమాట కిలో రూ ః 9.00                                                                   కిలో రూ. 62.00
పచ్చిమిర్చి కిలో రూ ః 20.00                                                              కిలో రూ ః 70.00
బెండకాయ కిలో రూ ః 38.00                                                              కిలో రూ ః 42.00
దొండకాయ కిలో రూ ః 18.00                                                              కిలో రూ ః 38.00
క్యాప్సికం కిలో రూ ః 28.00                                                                కిలో రూ ః 33.00
కాకరకాయ కిలో రూ ః 31.00                                                              కిలో రూ ః 38.00
వంకాయ కిలో రూ ః 19.00                                                                కిలో రూ ః 30.00

 

Vegetable prices have fallen
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News