Sunday, May 5, 2024

లాక్‌డౌన్ పొడిగింపుతో వలస కూలీల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Migrant workers

 

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తన యుద్ధాన్ని మరికొద్ది రోజులు పొడిగించింది. కొవిడ్19 కట్టడికి ఇప్పటికే ఒకసారి విధించిన లాక్‌డౌన్ గడువు ముగియడం… ఈ పరిమిత కాలంలో మహమ్మారి మాయం కాకపోగా మరింతగా జడలు విప్పుతుండడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ గడువు మంగళవారంనాటితో ముగియడంతో తాజాగా దాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.  సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు.  వేల సంఖ్యలో వలస కూలీలు స్టేషన్‌ దగ్గరకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు.  దీంతో వలస కూలీలు, కార్మికులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. వేల సంఖ్యలో స్టేషన్‌ దగ్గర గుమిగూడిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Migrant workers agitate at Bandra railway station
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News