Thursday, September 25, 2025

విజయవాడలో నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం…. సిసి కెమెరాలో రికార్డు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో దారుణం వెలుగులోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై పంజాసెంటర్ వద్ద మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 21వ అత్యాచార ఘటన సిసి కెమెరాలలో రికార్డు కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి చంటిగా (40) పోలీసులు గుర్తించారు. అత్యాచారానికి ఒడిగట్టిన తర్వాత బాధితురాలును నిందితుడు చిట్టినగర్ సొరంగం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు ఆమెను గుర్తించి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడు చంటి పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మన పవర్ తెలంగాణ సమాజానికి తెలుసు:కల్వకుంట్ల కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News