Saturday, December 7, 2024

తేలిపోతున్న విరాట్

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లి కొంత కాలంగా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విరాట్ పూర్తిగా విఫలమయ్యాడు. ఏ ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనరబచలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూడడం భారత్‌కు ఇబ్బందిగా తయారైంది. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో కోహ్లి పేలవమైన ఫామ్‌తో సతమతమవుతుండడం టీమిండియాకు ఇబ్బందికర అంశంగానే చెప్పాలి. ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా కలిగిన కోహ్లి ఇప్పటికైనా పూర్వ వైభవం సాధించాల్సిన అవసరం ఉంది. అతను గాడిలో పడితేనే టీమిండియా బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరుతాయి. లేకుంటే ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా భారత్‌కు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News