Wednesday, May 8, 2024

బ్యాక్టీరియాకు బతుకెక్కువ

- Advertisement -
- Advertisement -
Viruses are everywhere maybe even in space
అంగారక కక్ష్యలోనూ చావలేదు

టోక్యో : సూక్ష్మక్రిములు భూమిపైనే కాదు, ఏకంగా అంతరిక్షంలోనూ ఇతర గ్రహాల్లోనూ చావకుండా ఉంటాయని శాస్త్రజ్ఞులు తేల్చారు. అంగారక గ్రహానికి ప్రయాణ సమయంలో పంపించిన బ్యాక్టీరియాలు పలు రకాల థార్మిక కిరణాలు ప్రసరించినా ఏకంగా మూడేళ్లు తట్టుకుని నిల్చినట్లు కనుగొన్నారు. ఎటువంటి తొడుగులు ఇతరత్రా రక్షణ పరికరాలు లేకుండా భూమి నుంచి అంగారకుడి వద్దకు పంపించిన మిషన్ సందర్భంగా బ్యాక్టీరియాలను కూడా జతచేశారు. అయితే అవి చెక్కుచెదరకుండా ఉన్నట్లు ఆ తరువాత నిర్థారించారు. వీటి క్షీణ నిరోధక శక్తి గురించి ప్పుడు జపాన్ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. సూక్ష్మజీవులు అన్ని గ్రహాలకు చేరుకుం టూ ఉంటాయని, అవి అన్ని ప్రతికూలతలను చివరికి రేడియేషన్ ప్రభావా న్ని కూడా తట్టుకునే శక్తిని సంతరించుకుని ఉంటాయని ఇప్పుడు వెల్లడయినట్లు ఈ సైంటిస్టుల బృందం తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓ ప్రత్యేక రకమైన బ్యాక్టీరియాలను ఉంచి వాటి జీవత్వం గురించి అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఇవి నిక్షేపంగా ఉన్నట్లు తేలింది.

Viruses are everywhere, maybe even in space

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News