Tuesday, April 30, 2024

హై యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘ఎనిమి’..

- Advertisement -
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ‘వాడు వీడు’ తరువాత మరోసారి ‘ఎనిమి’ సినిమాతో ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విశాల్‌కు 30వ సినిమా కాగా ఆర్యకు 32వ సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో విశాల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. తెలుగులో విశాల్ డబ్బింగ్ చెబుతున్నట్టు ఒక వీడియో ద్వారా తెలిపారు. ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాలిని రవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ ప్రత్యేక పాత్ర ల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను చూస్తే ఇది హై యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Vishal Telugu dubbing for Enemy movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News