Monday, April 29, 2024

సెన్సార్ బోర్డులో అవినీతి ఆరోపణలపై స్పందించిన కేంద్ర సమాచార శాఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్‌సి) ముంబయి కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందంటూ తమిళ నటుడు విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది.ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఎక్స్(ట్విట్టర్)వేదికగా పోస్టు పెట్టింది. ఈ విషయంపై నేడు( శుక్రవారం) విచారణ జరపనున్నట్లు తెలిపింది.‘ సెన్సార్ కార్యాలయంలో అవినీతిజరిగినట్లు వార్తలు రావడం దురదృష్టకరం. అవినీతిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడినట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ రోజే ఈ విషయంపై దర్యాప్తు జరపనున్నారు’ అని ఆ ట్వీట్‌లో తెలిపింది.‘ మార్క్ ఆంటోనీ’ సినిమా హిందీవెర్షన్ సెన్సార్ కోసం తాను లంచం ఇవ్వాల్సి వచ్చినట్లు విశాల్ గురువారం ట్వీట్ చేశారు.

ఆ సినిమా సెన్సార్ కోసం రూ.6.5 లక్షలు లంచం ఇచ్చినట్లు ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని, మరో దారి లేక డబులు ఇవ్వాల్సి వచ్చిందని కూడా తెలిపారు. తనకే కాదు, భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని విశాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ, హహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు. ఈ మేరకు ఆ ఇద్దరి ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు. ఎవరెవరికి డబ్బు పంపించారో వారి పేరు, బ్యాంకు వివరాలను కూడా పోస్టులో పెట్టారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార శాఖ దీనిపై స్పందించింది.

ని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News