Sunday, May 5, 2024

వరదకు కొట్టుకుపోయిన పుష్కరఘాట్ గోదావరి రోడ్డు

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే బీటీ రోడ్డు కొట్టుకుపోయి సంవత్సరం గడుస్తున్నా మరమ్మత్తులకు నోచుకోలేదు. పుష్కరఘాట్‌కు వెళ్లి స్నానాలు చేయడానికి వీలు లేకుండా మారింది. గత వర్షాకాలంలో భారీ వర్షాలతో రోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. వేసవి కాలంలో నీరు తగ్గినప్పుడు పుష్కరఘాట్‌కు వెళ్లడానికి ఈ రోడ్డు ఉపయోగపడేది. వర్షకాలంలో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో నీరు నిలువ ఉండడం వల్ల రోడ్డుపైనే ఉన్న నీటిలో భక్తులు పుణ్య స్నానాలు చేసేవారు.

రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు పెద్ద కందకం ఏర్పడడంతో స్నానాలు చేయడానికి భక్తులకు వీలు లేకుండా మారింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పినా మలుకు నోచుకోలేదని స్తానిక ప్రజలు వాపోతున్నారు. ఈ వర్షకాలంలో నీరు అధికమైనప్పుడు భక్తులు స్నానానికి వెళ్లే నీటి లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదకరంగా మారినప్పటికి సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల భక్తులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News