- Advertisement -
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. జాతీయ రహదారి నీట మునిగిపోయింది. రోడ్డుపైకి వరద నీరు చేరుకోవడంతో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు రెండు వైపుల కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది వరద నీళ్లలోనే ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం అటువైపు ఇరిగేషన్ అధికారులు చూడడంలేదు. భారీ వర్షం కురవడంతో జిహెచ్ఎంసి పరిధిలో రోడ్లన్నీ జలమయంగా మారాయి.
- Advertisement -