Wednesday, May 8, 2024

మహారాష్ట్రలో 6 నెలల పాటు మాస్క్‌లు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

Wearing masks mandatory for next six: CM Uddhav Thackeray

 

ముంబై : వచ్చే ఆరు నెలల పాటు మహారాష్ట్రలో అంతా మాస్క్‌లు అనివార్యంగా వేసుకోవల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం తెలిపారు. మాస్క్‌ల ధారణలో రాజీ లేదని స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో చికిత్స కన్నా ముందు జాగ్రత్తలు ముఖ్యమని, కనీసం మరో ఆరు నెలల పాటు మాస్క్‌లు వేసుకుని తీరాలి. భౌతిక దూరం పాటించాలని థాకరే సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. నిపుణులు రాత్రిపూట కర్ఫ్యూ విధింపునకు సూచిస్తున్నారని, అయితే దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. నైట్‌కర్ఫ్యూలు కానీ మరో దఫా లాక్‌డౌన్‌లు కానీ ఉండబోవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో ఉందని, అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని, దీనిని అంతా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News