Sunday, April 28, 2024

బండి సంజయ్ కు వంద కోట్లు ఎక్కడివి?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక్కసారిగా ఈ కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే.. గంట వ్యవధిలోనే ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అబ్బే.. తాను ఆ కామెంట్స్ చేయలేదని ఏదో సరదాగా అంటే మీడియా సీరియస్‌గా తీసుకున్నాయని మాట మార్చేశారు. తాను నిబద్ధత కలిగిన బిజెపి కార్యకర్త అని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వార్త ఛానల్స్‌పై చర్యలు తీసుకుంటా అంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ట్వీటర్ వేదికగా హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని, పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చినా ఓకేనన్నారు. గత పదేళ్లుగా పార్టీ కోసం తనలా ఎవరూ కష్టపడలేదని అన్నారు. దుబ్బాకలో తన విజయాన్ని చూసిన తర్వాతనే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కాదా? పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావొచ్చు. 2 నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా, దుబ్బాక ఎన్నికల్లో నాకెవరూ సాయం చేయలేదు. నేను బిజెపిలోనే ఉండాలని అనుకుంటున్నా అంటూ ఆయన మాట్లాడారు.

బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధం. ఆయన పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాంటి సంజయ్ రూ. వందకోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని వ్యాఖ్యానించారు. తరుణుచుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావు..పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదు. వాళ్ల దృష్టికి తీసుకెళ్తే.. అదేంటి? అని ప్రశ్నించారు తప్ప.. తదుపరి చర్యలు తీసుకోలేదు. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు. దీనికి తోడు పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. మరోవైపు తన ముఖ్య అనుచరుల దగ్గర పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అయితే.. ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై, ప్రస్తుత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే.. గంట వ్యవధిలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. అబ్బే.. తాను ఆ కామెంట్స్ చేయలేదని ఏదో సరదాగా అంటే మీడియా చానెల్స్ సీరియస్‌గా తీసుకున్నాయని రఘునందన్‌రావు మాట మార్చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News