Sunday, May 5, 2024

నిమ్స్ పయనం ఎటు వైపు?

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: నిమ్స్ ఆసుపత్రి ఒకప్పడు అరుదైన సర్జరీలకు, కొన ఊపిరితో వచ్చిన రోగులకు వైద్యం అందించి అదే రోగిని పరిగెత్తించే స్థాయికి వైద్యం అందించే గొప్ప ఆసుపత్రిగా చరిత్ర ఉంది. దేశంలోనే అత్యంత అరుదైన సర్జరీ ఎక్కువగా నిమ్స్ ఆసుపత్రిలోనే జరుగుతాయనే మంచి పేరుంది. కానీ నేడు ఆ నిమ్స్ ఆ సుపత్రి గత వైభవం కోల్పోయింది అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా నిమ్స్‌లో కొందరు అధికారుల మధ్య విభేదాలు, కొందరి స్వార్ధపూరిత విధానాల వల్ల ని మ్స్‌లో రోగుల సేవలలో నాణ్యత లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కొందరు అధికారుల తీరుపై విసుకుచెందిన పలువురు ప్రముఖ వై ద్యులు నిమ్స్ విడిచి వెళ్లిపోవడం, మరికొందరు ప్ర ముఖ వైద్యులు పదవీ విరమణ పొందడంతో నిమ్స్ ఆసుపత్రిని బలహీన పరించింది అని చెప్పవచ్చు. ప్రభుత్వం మాత్రం కోట్ల రూపాయలు వెచ్చించి నిమ్స్‌ను దినదినాభివృద్ధి చేస్తోంది. అయితే నిమ్స్‌లో అనేక ప్రక్షాళనలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రు లతో కుమ్ముకైన కొందరు అవినీతి అధికారులు, పదవులు, ప్రమోషన్ల కోసం ఎంతైకైనా తెగించే స్వార్ధ పరుల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటు, వైద్యులకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలు అత్యవసరంగా కొనుగోలు చేయూల్సిన అవసరం ఉంది.

ఇక ప్రభుత్వం కేవలం నిమ్స్ పరిపాలన అధికారులతో మాత్రమే కాకుండా అహర్నిశలు కష్టపడి రోగులకు సే వలు అందించే వైద్యులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం మొదలు పెట్టాల్సిన అవసరం ఏంతైనా ఉందని కొందరు పేర్కొంటు న్నారు. దీనికి డైరెక్టర్ చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొందరు అవినీతి అధికారులకు పెత్తనం అప్పగించడం వల్ల అనేకమంది ప్రముఖ వైద్యులు నిమ్స్‌ని విడిచి వెళ్లారు.
ఇంకా అనేకమంది వైద్యులు ఈ అంతర్గత రాజకీయాల వల్ల విసిగిపోయి ఉన్నారు. ఏది ఏమైనా నిరుపేద రోగులకు నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిమ్స్ విస్తరణకు నడుము బిగించింది.

అయితే ఈ విస్తరణతోపాటు నిమ్స్ పరిపాలన విభాగంలో ఉన్న కొందరి అవినీతి అధికారులపై దృష్టి పెట్టడంతోపాటు, వైద్యుల, పలు విభాగాల్లో సేవలు అందించే సిబ్బంది సమస్యలపై దృష్టిపెడితే నిమ్స్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. అయితే ప్రభుత్వంతోపాటు కొత్తగా పగ్గాలు చేపట్టిన డైరెక్టర్‌కు అదే స్థాయిలో బాధ్యత ఉంది. నిమ్స్ పరిపాలన పగ్గాలు చేపట్టిన డైరెక్టర్ ప్రభుత్వ లక్షాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సిన అవసరం ఉంది.
ప్రాంతీయ భావాలు, తమ వారనే తారతమ్యాలు లేకుండా రోగుల సేవలకు ప్రాధాన్యత ఇ వ్వాలి. కేవలం కొందరు అధికారులు, సిబ్బందిని మా త్రమే కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అనేక చర్యలు తీసుకోవాలి. భజనపరులని పక్కనబెట్టి రోగుల సేవల నాణ్యత విషయంలో దృష్టిపెడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఇక విస్తరణ పనుల్లో పాలుపంచుకొని అం దినకాడికి దోచుకుందాం అని ఎదురుచూసే కొందరి అధికారులపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరముందని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News