Sunday, April 28, 2024

ఎవరీ ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. భీమ్ రావు అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్  ఎవరు అని చాలా మందికి కుతూహలంగా ఉంది. ఎందుకంటే ఆయన నేడు హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ 1954 మే 10న జన్మించారు. ఆయన రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది. ఆయన భరిప బహుజన్ మహాసంఘ్ అనే పార్టీకి అధ్యక్షుడు. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా(ఎంపీ) ఉన్నారు. ఆయన 12వ,13వ లోక్‌సభలో సభ్యుడు. మహారాష్ట్రలోని అకోలా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటులోని ఉభయ సభలలో సభ్యుడిగా ఉన్నారు.

ప్రకాశ్ అంబేడ్కర్ తండ్రిపేరు యశ్వంత్ అంబేడ్కర్(భయ్యాసాహెబ్), తల్లి పేరు మీర. ఆయన బౌద్ధ ధర్మాన్ని పాటిస్తారు. ఆయనకు భీమ్ రావు, ఆనంద్ రాజ్ అనే తమ్ముళ్లు, రమాభాయి అనే సోదరి ఉన్నారు. ఆమె ఆనంద్ టేల్‌టుబ్డేను వివాహం చేసుకున్నారు. ఇక ప్రకాశ్ అంబేడ్కర్ అంజలి మాయ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి సుజాత్ అనే కుమారుడు ఉన్నాడు.

ప్రకాశ్ అంబేడ్కర్ రిడిల్స్ మార్చ్ కేస్, రోహిత్ వేముల ఆత్మహత్య కేసు, అంబేడ్కర్ భవన్ కూల్చివేత కేసు, ఉన్నా దళిత్ అత్యాచారం కేసు, భీమా కోరెగావ్ హింసాత్మక కేసులో దేశవ్యాప్తంగా సామూహిక ర్యాలీలు నిర్వహించారు. ఆయన ‘టైమ్స్ నౌ ’ టివి యాంకర్ ఆనంద్ నర్సింహన్‌ను బెదిరించాక వివాదంలో చిక్కుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News