Sunday, September 15, 2024

బాలీవుడ్ బడా ఖాన్ నటులతో శ్రద్ధా కపూర్ ఎందుకు నటించలేదంటే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ఇప్పుడు బాలీవుడ్ లో బంపర్ హిట్ అయింది. ఈ సినిమా రూ. 400 కోట్ల రాబడిని దాటేసింది. అయితే బాలీవుడ్ ను రాజ్యమేలుతున్న ముగ్గురు ఖాన్ లు…అంటే, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో శ్రద్ధా కపూర్ ఎందుకు నటించలేదన్నది చాలా మందిలో తలెత్తే ప్రశ్న. ఇటీవల శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్ లో ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది.

ఆ ఖాన్ లతో నటించే సరైన అవకాశం లభించలేదంది. వాస్తవానికి ఆ నటులతో నటించే ఆఫర్లయితే తనకొచ్చాయని, కానీ పాత్రలు తనకు నచ్చక చేయలేదని తెలిపింది.  తన పాత్రలను తాను కేర్ ఫుల్ గా ఎంచుకుంటుంటానని తెలిపింది. ‘‘ కొన్నిసార్లు, మీకు సినిమా ఆఫర్లు వస్తాయి. అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న పాత్ర దొరకకపోతే, ఛాలేంజింగ్ గా ఉన్న పాత్ర దొరకకపోతే, కాదని చెప్పడమే మంచిది’’ అని శ్రద్ధా కపూర్ వివరించింది. తాను నటిగా ఎదగాలంటే తాను తన పాత్రలను ఎంచుకుని తీరాల్సిందేనని తేల్చి చెప్పింది.

సినిమా రంగంలో తన లక్ష్యం గురించి చెబుతూ,  మంచి కథ, మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు, అర్ధవంతమైన పనితనం ఉన్న వాటిలోనే తాను ఉండాలనుకుంటున్నానని, ఒకవేళ ఖాన్ ల సినిమాలో తాను కోరుకున్నవన్నీ దొరికితే తప్పక నటిస్తానని స్పష్టం చేసింది.

ఇండస్ట్రీ ట్రాకర్ ‘సాక్నిల్క్’ ప్రకారం, ‘స్త్రీ2’ బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకు పైగా రాబట్టింది. అది కూడా దేశీంయంగానే. ఇక మరో రూ. 55 కోట్లు విదేశాల్లో రాబట్టింది. ప్రపంచవ్యాప్తం మొత్తంగా అయితే రూ. 400.15 కోట్లు రాబట్టిందని సమాచారం. నేడు బాలీవుడ్ లో విజయవంతమైన నటిగా శ్రద్ధా కపూర్ ను చెప్పుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News