Thursday, May 2, 2024

చావనన్నా చస్తా కానీ…: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi
న్యూఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(బిజెపి)తో కుమ్మకు అవుతోందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బిఎస్‌పి) ఆరోపించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం ఖండించారు. తాను చావనన్న చస్తాను కానీ కాషాయ శిబిరంతో పొత్తు మాత్రం కుదుర్చుకోనని అన్నారు. గోరఖ్‌పూర్‌లో ఆమె ‘ప్రతిజ్ఞ ర్యాలీ’లో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.
ప్రజల కష్టకాలంలో బిఎస్‌పి, ఎస్‌పి ఎప్పుడూ మద్దతుగా నిలవలేదన్నారు. “వారు మేము బిజెపితో కుమ్మకై పనిచేస్తున్నామంటారు. వారు కష్టకాలంలో మీ పక్షాన ఎందుకు నిలవడంలేదు. ప్రజల పక్షాన కేవలం కాంగ్రెస్ మాత్రం పోరాడుతోంది. నేను చావనన్న చస్తాను కానీ బిజెపితో ఎలాంటి సంబంధం పెట్టుకోను” అని ఓ వార్తా సంస్థలో అన్నారు.
ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా ఇందిరా గాంధీ వర్ధంతిని గుర్తుకు తెచ్చుకున్నారు. “ఆమె హత్యకు గురికావొచ్చన్నది ఆమెకు తెలుసు. కానీ ఎప్పుడూ ఆమె తన హామీలను ఉల్లంఘించలేదు. తనపై తనకున్న నమ్మకం కన్నా ఆమెకు ఏదీ గొప్పది కాదు. ఆమె బోధనల వల్లే నేను ఈ రోజున మీ ముందు నిల్చున్నాను. నేను కూడా ఎప్పుడూ మీ(ప్రజల) నమ్మకాన్ని వమ్ముచేయను” అన్నారు.
“నేను నా సోదరీమణులకు ఒకటే చెప్పదలచుకున్నాను. నేను మీ కోసం పోరాడతాను. మీ కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. మీ సంఘర్షన మీరే చేసేందుకు మీకు నేను అధికారాన్ని ఇస్తాను. ఎప్పుడైతే మహిళలు 40 శాతం మేరకు రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు రాజకీయాల రూపురేఖలే మారిపోతాయి” అన్నారు. “ఇక్కడ కాంగ్రెస్ నెలకొల్పిన పంచదార మిల్లులను ఎవరు మూసేశారో మీకు తెలుసు. ఆ మిల్లులను ఎస్‌పి, బిఎస్‌పి ప్రభుత్వాలు మూసేశాయి. ఆ పార్టీలే నేడు కాంగ్రెస్, బిజెపితో కుమ్మకయిందని ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు ఇంకా కొన్ని నెలలు ఉందనగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చెరకుకు కనీస మద్దతు ధరను ఇస్తానని ప్రకటించింది. గత నాలుగున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయన ప్రభుత్వం ఇన్నాళ్లు ఏమి చేయకుండా ఇప్పుడెందుకు కనీస మద్దతు ధర ఇస్తానంటోంది? అంటే చెరకు మద్దతు ధర పెంచేందుకు ఇంత కాలం సమయం రాలేదా?” అని ఆమె ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News