Sunday, April 28, 2024

రేపు గోవాకు అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -


ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబర్ 31న గోవా చేరుకోనున్నారు. ఆయన సోమవారం అక్కడ విలేకరుల సమావేశం కూడా చేపట్టనున్నారు. 2022 పూర్వ భాగంలో గోవా అసెంబ్లీ 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమకోస్తా రాష్ట్రమైన గోవాలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్,టిఎంసి, ఆప్ పార్టీలు ప్రయత్నాలు మొదలెట్టాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బిజెపికి అధికారం ఉంది. కేజ్రీవాల్ గోవా ప్రజలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సెప్టెంబర్‌లోనే ఆయన ప్రైవేట్ రంగం సహా అన్ని రంగాల ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఆయన గనులు, పర్యాటక రంగం తిరిగి మామూలు స్థితికి వచ్చే వరకు ఆ రంగాలపై ఆధారపడిన కుటుంబాలకు నెలకు రూ. 5000 ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. గత 3-4 నెలల్లో గోవాకు కేజ్రీవాల్ చేయబోతున్న ఈ పర్యటన మూడవది. ఇదివరలో ఆయన జులైలో పర్యటించినప్పుడు గోవాలో ఎన్నికల అనంతరం తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్టయితే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News