Saturday, May 4, 2024

మణిపూర్ గాయాలు మాన్పుతాం

- Advertisement -
- Advertisement -

తౌబాల్: మణిపూర్ ప్రజానీకానికి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ శాంతి సామరస్య సందే శం వెలువరించారు. మీ బాధలను పంచుకుంటామని, తోడుగా ఉంటామని మణిపూర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన మణిపూర్‌లోని తౌబాల్ నుంచి తమ సారధ్యపు భా రత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించారు. తెగల నడుమ ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్ పరిస్థితి పట్ల ఈ నేత ఆందోళన వ్యక్తం చే శారు. రాష్ట్రానికి శాంతి సామరస్యం తిరిగి వచ్చేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన వాగ్దా నం చేశారు. తౌబాల్‌లో న్యాయ్ మైదాన్ పేరిట వెలిసిన గ్రౌండ్‌లో ఆరంభం నేపథ్యం లో ఏర్పాటు అయిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపిలకు అసలు మణిపూర్ భారత్‌లో అంతర్భాగం అనే విషయం గుర్తుందా? దీనిని మరిచిపోయ్యారా? అని రాహుల్ విరుచుకుపడ్డారు.

ఘర్షణలతో ఇక్కడ లక్షలాది మంది కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. ఎంత జరిగినా ఇక్కడి శోకతప్త ప్రజలను ఓదార్చేందుకు, వారి కన్నీరు తుడిచివేసేందుకు కనీసం ఇక్కడ రాలేదు. మీ చేతిలో చేయ్యేసేందుకు, మిమ్నల్ని అక్కున చేర్చుకుని  సేదదీర్చేందుకు రాలేదు. మీ బాధ వారి బాధ కాదా? మిమ్మల్ని ఈ దేశంలోని అంతర్భాగం అనుకోవడం లేదా? అని ప్రశ్నించారు. మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న కడగండ్ల గు రించి తమకు తెలుసునని, వారు ఇళ్లూ వాకిళ్లు వదిలిపెట్టి , ప్రాణరక్షణకు పరుగులు తీసే పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇది జాతికి సంబంధించిన పెనుగాయం. ప్రధాని మోడీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కానీ దీని గురించి ఆలోచించే కనీస బాధ్యత లేదా? అని నిలదీశారు.

ఇక్కడి గాయపడ్డ మనసులను, వారి విషాదాన్ని తాము పంచుకొంటామని హామీ ఇచ్చారు. తిరిగి ఈ ప్రాంతంలో శాంతి సామరస్యం నెలకొనేలా చూస్తామని, ఈ యాత్ర ఇక్కడి నుంచి ఆరంభిస్తున్న దశలో ఇది తాను ఇస్తున్న మాట అని తెలిపారు. ప్రధాని మోడీకి సముద్ర తీరాల వెంబడి తిరిగే తీరిక ఓపిక ఉంది. సముద్రాలలో స్నానం చేసే సరదా ఉంది. అయితే మండుతోన్న మణిపూర్‌ను సందర్శించే సమయం లేదని రాహుల్ విమర్శించారు. అంతకు ముందు రాహుల్ స్థానిక ఖోంగ్జామ్ యుద్ధ స్మారక స్తూపం వద్దకు చేరుకుని అమరులకు నివాళులు అర్పించారు.1891లో జరిగిన ఆంగ్లో మణిపూర్ వార్‌లో బలి అయిన వారిని రాహుల్ స్మరించుకున్నారు. రాజధాని ఇంఫాల్‌కు తొలుత విమానంలో వచ్చారు. విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.
బిజెపి పెదవులపై రామ నామం, వెంట కత్తికటార్లు
రాహుల్ గాంధీ ఆయన బృందం తలపెట్టిన యాత్ర ఆరంభసూచకంగా వీరు ప్రయాణించే బస్సును కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే పచ్చజెండా చూపి ప్రయాణానికి సంకేతం వెలువరించారు. ప్రధా ని మోడీ ఈశాన్య రాష్ట్రాలలో కేవలం ఓట్లు అడిగేందుకు వస్తుంటారని, రామ్ రామ్ అంటూ ఓట్లు అడుగుతారు కానీ ఇక్కడి ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు. బిజెపి రామనామం జపిస్తుంది. అయితే విద్వేషపు కత్తిని పెట్టుకుని సంచరిస్తుందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడూ సామాజిక న్యాయానికి, లౌకికతకు కట్టుబడి ఉంటుంది. సమానతను పాటిస్తుంది. ఇందులో అంతర్భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు వివరించారు.

ముప్పు వాటిల్లిన దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని తెలిపారు. పాసిస్టు శక్తులతో పోరాడేందుకు రాహుల్ యాత్ర సాగుతుందని వివరించారు. రాహుల్ ఆధ్వర్యంలో సాగే భారత్ జోడో యాత్ర 2 దేశవ్యాప్తంగా 6713 కిలోమీటర్ల దూరం సాగుతుంది. 110 జిల్లాల పరిధిలోని 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మార్గాల మీదుగా ఈ యాత్ర ఉంటుంది. మణిపూర్‌లో ఆరంభమైన ఈ యాత్ర 67 రోజులకు మార్చి 20వ తేదీన ముంబై చేరుకుని ముగుస్తుంది. రాహుల్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News