Saturday, April 27, 2024

బెదిరేది లేదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూ ర్తితోనే నేడు మ రో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హ క్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బా ధ్యత బిఆర్‌ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమకారులదేనని కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షి ణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశా రు. కెఆర్‌ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీ ద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జు ట్టు అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రం గా ఖండిస్తూన్నామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బిఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు. తెలంగాణ రై తాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రా జెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి)కిఅప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్నతెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖం డిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

నల్గొండ భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉద్ధృతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎంఎల్‌ఎలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్యులతో కీలక సమావేశంలో కృష్ణా నదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కెఆర్‌ఎంబికి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తే నష్టాలు పర్యవసానాలుపై చర్చించారు. కృష్ణా ప్రాజెక్టులు నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక వైఖరిపై చేపట్టవలసిన తదుపరి కార్యాచరణపై అధినేత దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాగునీరు తాగునీటి హక్కులకోసం పోరాడడమే కాకుండా “మా నీళ్లు మాకే” అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ప్రజా మద్దతుతో తిప్పికొడతాం
కెఆర్‌ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందని కెసిఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామని పేర్కొన్నారు. తద్వారా హైదరాబాద్ రంగారెడ్డి,నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కెసిఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి.జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి,సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌తోపాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపీలు జడ్‌పి చైర్మన్లు, కార్పొరేషన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నన్ను.. నా పార్టీని టచ్ చేయలేరు…
తెలంగాణ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడాన్ని బిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణా నదీ పరీవాహక ప్రాంత బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లు కేంద్రానికి అప్పగించాలని.. లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనను బెదిరించారని గుర్తు చేశారు. “కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో… నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా… తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను.. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పిన” అని కెసిఆర్ పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. బిఆర్‌ఎస్ పార్టీని, తననూ వ్యక్తిగతంగా కొత్త సిఎం రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, తనను…తన పార్టీని టచ్ చేయడం కొత్త సిఎంతో కాదని, రేవంత్ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర తమకున్నదని అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం… దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కుపోడు… ఉడుత బెదిరింపులకు భయపడను… ముందు ముందు ఏందో చూద్దాం’ అని కెసిఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ దాదాపు మూడు నెలల విరా మం తర్వాత మంగళవారం తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి గులాబీ బాస్‌కు ఘనస్వాగతం పలికారు. కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల అంశంపై నేతలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News