Tuesday, May 7, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. విలియమ్సన్@2

- Advertisement -
- Advertisement -

Williamson at No 2 in Test batting Rankings 2020

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ఐసిసి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి కేన్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. స్మిత్ అగ్రస్థానంలోనే నిలిచాడు. అయితే వెస్టిండీస్‌పై అద్భుత డబుల్ సెంచరీ సాధించిన విలియమ్సన్ మాత్రం తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. స్మిత్ 911 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కోహ్లి, కేన్ విలియమ్సన్ చెరో 886 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచారు. లబూషేన్(ఆస్ట్రేలియా) నాలుగో, బాబర్ ఆజమ్(పాకిస్థాన్) ఐదో ర్యాంక్‌ను సాధించారు.

డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) ఆరో, చటేశ్వర్ పుజారా(భారత్) ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. ఇక బౌలింగ్‌లో పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) 904 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ వాగ్నర్ రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. భారత స్వీడ్‌స్టర్ బుమ్రా 9వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ రెండో ర్యాంక్‌లో నిలువగా భారత్ మూడో ర్యాంక్‌ను కాపాడుకుంది.

Williamson at No 2 in Test batting Rankings 2020

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News