Tuesday, May 21, 2024

చట్టాల రద్దు చేతకాకుంటే పదవి నుంచి వైదొలగండి

- Advertisement -
- Advertisement -

Resign if the laws are not repealed

 

కేంద్ర ప్రభుత్వం పై మమతా బెనర్జీ ధ్వజం

మిడ్నపూర్ (పశ్చిమబెంగాల్ ) : అన్ని సామజిక వర్గాలు సుదీర్ఘకాలంగా సామరస్యంతో మనుగడ సాగిస్తున్న పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రం మహాత్మా గాంధీ హంతకుల ముందు ఏనాడూ తల వంచదని, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం గట్టిగా చెప్పారు. స్వప్రయోజనాల కోసం బిజెపి విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. పశ్చిమమిడ్నపూర్‌లో ర్యాలీలో ఆమె ప్రసంగించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్న రైతుల కష్టాల పట్ల కేంద్రం లోని బిజెపి ప్రభుత్వ నిర్లక్ష ధోరణిని తూర్పారపట్టారు.

ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకొండి లేదా అది చేతకాకుంటే పదవి నుంచి వైదొలగండి అని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు. మౌనంగా చూస్తూ ఉండడం లేదా కేంద్రంతో సర్దుకు పోవడం కన్నా జైలులో తానుండడమే మేలుగా భావిస్తానని ఆమె స్పష్టం చేశారు. బిజెపి మాదిరిగా తనకు బెంగాలీ, బెంగాలేతరులనే రాజకీయ విభేదాలు, హిందూ ముస్లిం వర్గ విభేదాలపై తనకు నమ్మకం లేదని, వీరంతా తనకు సోదరులేనని ఆమె స్పష్టం చేశారు.

బిజెపి అన్నది రాష్ట్రం బయటివారి పార్టీ అని, బెంగాల్‌ను నియంత్రించ డానికి కాషాయం శిబిరాన్ని తాను ప్రవేసించనివ్వనని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి తామేం చేస్తున్నామో పట్టించుకోకుండా తమను కించపర్చడానికి నిత్యం బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. రఫేల్ స్కామ్, పిఎం కేర్స్ ఫండ్ ? స్కామ్‌ల సంగతేమిటి ? అని ఆమె ప్రశ్నించారు. సిపిఐ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ పశ్చిమ మిడ్నపూర్‌లో వారు భయోత్పాతం సృష్టించారని, సిపిఎం దౌర్జన్యాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారని అప్పుడు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అడిగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదని ఆమె ఆనాటి పరిస్థితిని విమర్శించారు. మూడోసారి తమ పార్టీ అధికారం లోకి వచ్చి ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని కొనసాగిస్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News