Sunday, April 28, 2024

ఇక భవిష్యత్ అంతా వైర్‌లెస్ విద్యుత్తే

- Advertisement -
- Advertisement -

Wireless Electricity in the future

త్వరలోనే కల సాకారం అవుతుందంటున్న
విద్యుత్ రంగ నిపుణులు

మన తెలంగాణ, హైదరాబాద్ :  వీదుల్లో విద్యుత్ స్తంభాల తీగలు ఉండవు… రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్స్ ,టవర్లు ఉండవు. కానీ ఇళ్ళల్లో మాత్రం విద్యుత్ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటాయి. ఫ్రిజ్, ఏసీలు, గీజర్, టివీలు అన్ని యదావిధిగా పనిచేస్తూనే ఉంటాయి. దీన్ని ఊహించకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా. కాని త్వరలో అదే నిజమయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఇదేమీ అసాద్యం కాదని ప్రయోగత్మకంగా కూడా రుజువైనట్లు చెబుతున్నారు. వైర్‌లెస్ చార్జింగ్, విద్యుత్ వాహనాలు, స్వయంచాలిత వాహనాలు, 5జి వంటి ఆధునిక పరికరాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వైర్‌లెస్ విద్యుత్ అంశం ఉత్కంఠం రేపుతోంది. సుస్దిర అభివృద్ది దిశగా ఈ టెక్నాలజి ప్రాధాన్యత సంతరించుకంటోంది. ఇప్పటికే వినియోగం దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. అతి కొద్ది సంవత్సరాల్లోనే ఇది సాధ్యం అవుతుందంటున్నారు. అమెరికాకు చెందిన వేవ్ ఇంక్ దగ్గర నుంచి జపాన్‌లోని స్పేస్ పవర్‌టెక్నాలజీ, న్యూజిలాండ్ ఇంధన అంకుర సంస్థ ఎమ్రాడ్ వరకు ఎన్నెన్నో సంస్థలు వైర్‌లెస్ విద్యుత్ పంపిణీ టెక్నాలజిపై దృష్టిసారించాయి. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన పరీక్షలు క్షేత్రస్థాయిలో ప్రారంభం అయ్యాయి.

వందేళ్ళ కల..

సెర్బియాలో ఆమెరికన్ శాస్త్రవేత్త నికోల టెస్లా 1891లోనే ఇందుకు పునాది వేశారు. విద్యుత్‌దయాస్కాంత తరంగాల ద్వారా శూన్యంలో ఇంధనాన్ని పంపిణీ చేయవచ్చుని జెమాక్స్ వెల్ 1873లోనే ప్రతిపాదించారు. ఈ స్పూర్తితో టెస్లా ఒక వినూత్న పరికరాన్ని రూపొందించారు. విద్యుత్ సర్యూట్‌లో ఇన్‌ఫుట్ ,అవుట్‌పుట్ మద్య అవరోధం సుమారు సున్నా స్థాయికి చేరుకున్నప్పుడే పుట్టుకొచ్చే విద్యుత్ ప్రతి ధ్వని సిద్దాంతం ఆధారంగా పని చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. తీగలు లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేదిశగా న్యూజిలాండ్ ప్రయోగం కొత్త ఆశలు రేపుతోంది. ఆ దేశానికి చెందిన ఎమ్రాడ్ కంపెనీ ఇందుకు శ్రీకారం చుట్టింది. యాంటెనాల అనుసంధానంతో కూడిన ఇదోక ప్రత్యేకమైన విధానం.దీంతో విద్యుత్‌యస్కాంత తరంగాల రూపంలో ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తుంది.

ఇప్పటికే దీనిపై పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇది విజయవంతమైతే వెర్‌లెస్ విద్యుత్ పంపిణీ విధానంగా రికార్డులకు ఎక్కుతుందంటున్నారు. డీసీ విద్యుత్‌ను లేజర్ పుంజంగా మార్చి ఆప్టిక్ ఫైబర్ ద్వారా పంపిణీ చేయడం మరొక పద్దితి.దీన్ని పవర్ బీమింగ్ అంటారు.ఎందుంకటే ఇందులో ముందుగా విద్యుత్ లేజర్‌రూపంలో ఫొటో వోల్టాయిక్ రిసీవర్‌కు చేరుకుంటుంది. దీనిలో ప్రత్యేమైన కన్వర్లర్లు లేజర్‌నుతిరిగి విద్యుత్‌గా మారుస్తాయి. లేజర్ విద్యుత్ పంపిణీ సంస్థలను మొదటిసారిగా 218లో ప్రదర్శించారు. ఇది గదిలో స్థిరంగా ఉన్నా , కదులుతున్న పరికరాలకు విద్యుత్‌ను చేరవేయడం ప్రత్యేకం మని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News