Sunday, April 28, 2024

కొడుకు చదువుకోసం తల్లి ప్రాణత్యాగం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కొడుకు చదువుకోసం నష్టపరిహారం కింద డబ్బులు వస్తాయన్న ఆశతో ఒక తల్లి బస్సు కిందపడి మరణించింది. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది. జూన్ 28న ఈ ఘటన జరిగినప్పటికీ మంగళవారం ఇందుకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

46 ఏళ్ల పాపతి అనే మహిళ వేగంగా నడుస్తూ హఠాత్తుగా రోడ్డు మధ్యకు వచ్చేసి బస్సుకు ఎదురెళ్లింది. వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ప్రజలు తేరుకునేలోపే క్షణాల వ్యవధిలో ఈ దారుణం జరిగిపోయింది. మీడియా కథనాల ప్రకారం సేలం మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న పాపతికి నెలకు రూ. 10,000 జీతం. ఇద్దరు పిల్లల తల్లి అయిన పాపతిని ఆమె భర్త వదిలిపెట్టడంతో తానే పిల్లల చదువుల భారాన్ని మోస్తోంది.

పెద్ద కుమార్తె ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుండగా కుమారుడు ఒకప్రైవేట్ కాలేజీలో డిపొమా ఇన్ ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. తన కుమారుడి చదువుకోసం పాపతికి రూ. 15,000 అవసరమయ్యాయని సేలం బి1 టైన్ పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభిస్తుందన్న ప్రకటనను ఆమె ఒక దినపత్రికలో చూసిందని, దీంతో తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆమెను తప్పుదోవ పట్టించారా అన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.

ముఖ్యమంత్రి ప్రమాద సహాయ నిధి(తమిళనాడు) కింద రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధితుని కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున సహాయం అందచేస్తుంది. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం కలిగిన పక్షంలో రూ.50,000, తీవ్రవ గాయాలకు రూ. 50,000, ఒక కన్ను లేదా చేయి కోల్పోతే రూ. 30,000, స్వల్ప గాయాలకు రూ. 10,000 వంతున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందచేస్తుంది.

మొదట్లో దీన్ని ప్రమాద కేసుగా నమోదు చేసినప్పటికీ బస్సు కింద పాపతి స్వయంగా పడినట్లు ఇప్పుడు సిసిటివి పుటేజ్ బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News