Monday, May 13, 2024

World Cup 2023: న్యూజిలాండ్ టార్గెట్ 246

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్ జట్టుకు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 50 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్ మెన్లలో ముష్ఫికర్ రహీమ్(66) అర్థ శతకంతో రాణించాడు.

షికీబ్ అల్ హసన్(40), హసన్ మిర్జా(30)లు ఫర్వాలేదనిపంచారు. మిగతావారు ఘోరంగా విఫలమవ్వగా, చివరల్లో మహ్మదుల్లా(41 నాటౌట్) కీలక పరుగులు జోడించాడు. కివీస్ బౌలర్లలో ఫర్గుసన్ మూడు వికెట్లతో రాణించాడు. ట్రెంట్ బౌల్ట్, హెన్రీలు చెరో వికెట్లు రెండు పడగొట్టగా.. సాంట్నర్, ఫిలిప్స్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News