Sunday, April 28, 2024

కోవాగ్జిన్‌పై ప్రపంచ దృష్టి

- Advertisement -
- Advertisement -

World focus on of Covaxin: ICMR

 

మూడో దశ ట్రయల్స్‌కు చేరిక

న్యూఢిల్లీ : భారత్ తయారీ కొవిడ్ టీకా మందు కోవాగ్జిన్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతం అయింది. ఈ విషయాన్ని భారత అత్యున్నత వైద్య పరిశోధనా మండలి అయిన ఐసిఎంఆర్ తెలిపింది. ఐసిఎంఆర్ భారత్ బయోటోక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ రూపకల్పనలో ఉన్నాయి. ఇప్పటికి నిర్వహించిన నమూనా పరీక్షలలో ఈ వ్యాక్సిన్ అత్యుత్తమ ఫలితాలు వెలువడ్డాయి. భద్రతకు భద్రత, తగు పనితీరు, రోగనిరోధక శక్తిలో ధీటైన తీరు వంటివి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఈ వ్యాక్సిన్ పట్ల ఆసక్తికి కారణం అయ్యాయి. ఈ భారతీయ కంపెనీ తయారీ వ్యాక్సిన్ విశేషాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్య పరిశోధనల మేగజైన్ లాన్సెట్ తాజాగా విశ్లేషించింది. కోవాగ్జిన్ ఫేజ్ 1, ఫేజ్ 2ల విజయవంత, ప్రోత్సాహక దశల పూర్తితో ఇక మూడో దశ ట్రయల్స్ ఆరంభం అయ్యాయని ఐసిఎంఆర్ ప్రకటించింది. ఈ కీలకమైన మూడో దశ ట్రయల్స్ 22 చోట్ల సాగుతున్నాయి. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కోసం స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ పిలుపు నిచ్చింది. పూర్తిగా స్వదేశీ వైద్య శాస్త్రీయ పరిజ్ఞానంతోనే హైదరాబాద్ శివార్లలోని భారత్ బయోటెక్‌లో కోవాగ్జిన్ రూపొందుతోంది. ఎయిమ్స్‌లో కూడా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News