Tuesday, May 21, 2024

కదంతొక్కిన ట్రావిడ్ హెడ్, స్మిత్.. ఆస్ట్రేలియా 327/3

- Advertisement -
- Advertisement -

కదంతొక్కిన ట్రావిడ్ హెడ్, స్మిత్
ఆస్ట్రేలియా 327/3, భారత్‌తో డబ్లూటిసి ఫైనల్
లండన్: భారత్‌తో బుధవారం ప్రారంభమైన డబ్లూటిసి ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి రోజు పైచేయి సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా బుధవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సిరాజ్‌కు ఈ వికెట్ దక్కింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ధాటిగా ఆడిన వార్నర్ 8 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఆ వెంటనే లబుషేన్ (26) కూడా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు చిక్కుకుంది.

ఆదుకున్న హెడ్, స్టీవ్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ తమపై వేసుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. హెడ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడగా స్మిత్ ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ 156 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్మిత్ 14 బౌండరీలతో అజేయంగా 95 పరుగులు సాధించాడు. ఇద్దరు ఇప్పటి వరకు నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News