Monday, May 27, 2024

బిజెపిని నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరు

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: బిజెపి పార్టీ రాష్ట్రంలో తలకిందులుగా యాత్రలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. అధికారం కోసం బిజెపి అనేక వేశాలు వేస్తుందని ఆయన మండిపడ్డారు. దేశంలో బిజెపి పార్టీ మునిగిపోతున్నదని ప్రధాని నరేంద్రమోడి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నేనావత్ పత్యనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడారు.

మంగళవారం ఆమనగల్లు పట్టణంలో జరిగిన బిజెపి సంకల్ప సభలో బిజెపి నాయకులు డీకే అరుణ, ఈటెల రాజేందర్‌లు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని అనడం సిగ్గుచేటని అన్నారు. బిజెపి అధికారంలో ఉన్న 18 రాష్ట్రాలలో తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో ఒక్కటైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. 9 సంవత్సరాల పాలనలో 88 లక్షల కోట్ల అప్పులు చేసి, ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని కుల మతాలను సమానంగా గౌరవిస్తుందని తెలిపారు. ప్రజా గోస యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర, విజయ సంకల్ప సభలు ఎన్ని సభలు, ఎన్ని యాత్రలు చేసిన బిజెపిని ప్రజలు విశ్వసించరని అన్నారు. తెలంగాణలో 48 లక్షల మందికి నెలకు 15 లక్షల కోట్ల రూపాయలతో పెన్షన్ అందజేస్తూ, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఎమ్మెల్యే అన్నారు.

పార్లమెంటులో నల్ల చట్టాలు తీసుకవచ్చి, దాదాపు 800 మంది అన్నదాతల చావుకు బిజెపి కారణమైందని ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ రాష్ట్రానికి పోతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆయన వాహనాలను అడ్డుకోని తిరిగి వెనక్కి పంపడం జరిగిందని, దీంతో విధిలేక నల్ల చట్టాలను రద్దు చేశారని ఇంతకన్న సిగ్గుచెటు ఎమైనా ఉందా అని ఎమ్మెల్యే అన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు దోనాదుల కుమార్, సోనాశ్రీనునాయక్, సయ్యద్ ఖలీల్, వంకేశ్వరం భీమయ్య, వడ్డె వెంకటేష్, చుక్క నిరంజన్‌గౌడ్, రమేష్‌నాయక్, ప్రశాంత్‌నాయక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News