Friday, May 3, 2024

జపాన్ ప్రధాని రేస్‌లో యోషిహిడే సుగా..

- Advertisement -
- Advertisement -

Yoshihide Suga as candidate for Japan PM

టోక్యో: జపాన్ తదుపరి ప్రధాని రేస్‌లో కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడేసుగా(71) ముందంజలో ఉన్నట్టు ఆ దేశ మీడియా సర్వేల్లో వెల్లడైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన షింజోఅబే అనారోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో ఇదే పార్టీకి మెజారిటీ ఉండటంతో వారి నుంచే ప్రధానిని నిర్ణయిస్తారు. పార్టీలో సుగాకు పోటీగా మాజీమంత్రులు సిగేర్ ఇషిబా,ఫుమియో కిషిడా ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా నిర్వహించే ఎన్నిక సెప్టెంబర్ 14న జరగనున్నది. పార్టీలోని ముఖ్య నేతలు సుగావైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం కోసం గతవారం సుగా ఆనవాయితీగా నామినేషన్ వేశారు.

Yoshihide Suga as candidate for Japan PM Post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News