Monday, May 20, 2024

పనిచేయాల్సిందే… లేకపోతే తప్పుకోవచ్చు

- Advertisement -
- Advertisement -

అధికారులు మా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయాలంటే 18 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇబ్బంది అనిపిస్తే వారిని మరో చోటుకి బదిలీ చేస్తాం. ఒకప్రజా ప్రతినిధిగా అధికారులకు సూచిస్తున్నా.. మీ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కలెక్టర్లుగా, ఎస్పీలుగా మీకుంటుంది. ప్రజలను ప్రత్యక్షంగా కలిస్తే వారి భావాన్ని, భాషను అర్థం చేసుకునే అవకాశముంది. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. దీనిని ఉపయోగించుకుంటారని, తద్వారా అద్భుతంగా పనిచేస్తారని ఆశిస్తున్నా. ప్రతి అధికారులు బాగా చదువుకుని ప్యాషన్‌తో వచ్చారు. ఆ విషయంలో ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. మేము ఆలోచన చేసిన దానితో పోల్చితే మీరు ఇంకా ప్రజలకు బెటర్‌గా పని చేయడానికి సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో మాకు ఎలాంటి భేషజాలు లేవు. మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలం, మీ ఆలోచనలను పాలసీ కింద కన్వర్ట్ చేసి అమలు చేసేందుకు మీ దగ్గరికి మాత్రమే పంపిస్తాం. మీ సూచనలు సలహాలను ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. జవాబుదారీతనం, బాధ్యత చాలా ముఖ్యమైనది. అధికారులకు సమగ్రత, నీతి నిజాయితీ పెద్ద కొలమానం. మీకిచ్చే పోస్టింగ్‌లో వీటిని పరిగణలోకి తీసుకుంటాం.
– అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News