Tuesday, May 7, 2024

హెచ్‌ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత

- Advertisement -
- Advertisement -

HIV

 

హైదరాబాద్ : కొత్తగా హెచ్‌ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ స్టేట్ కో ఆర్డినేటర్ కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్‌ల ఆధ్వర్యంలో సోమవారం ‘జాతీయ యువజన దినోత్సవాన్ని’ నిర్వహించారు. యువజన దినోత్సవంలో భాగంగా ‘దేశ నిర్మాణంలో యువత పాత్ర’ గురించి విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాల, ఖైరతాబాద్‌లో నిర్వహించారు.

స్వామి వివేకానందుని ఆశయ స్ఫూర్తిని యువతలో నింపడంతో పాటు వ్యక్తిగతంగా, భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎలా తయారు కావాలన్న దానిపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు అవగాహన కల్పించారు. హెచ్‌ఐవి ఎలా సోకుతుంది, హెచ్‌ఐవి వ్యాప్తి, దానిని ఎలా నివారించవచ్చు, ఈ వ్యాధి ఎవరికీ సోకే ప్రమాదం ఉంది, వ్యాధిపై ఉన్న అపోహలు, వ్యాధి నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు ఎక్కడ చేస్తారు, అందుబాటులో ఉన్న చికిత్స వివరాలు తదితర విషయాలపై యువతకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

ఈ వ్యాధి సోకిన వారి పట్ల ఎలా సానుభూతితో ఉండాలన్న విషయాలతో పాటు వ్యాసరచన, పెయింటింగ్ తదితర పోటీలను నిర్వహించిన విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ర్యాలీ తీశారు. హెచ్‌ఐవి సోకిన వారి పట్ల సానుభూతితో మెలుగుతామని, ఈ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

Young people 15 to 24 years old with HIV
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News