Wednesday, May 15, 2024

ఏడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే 98/7

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా: పెర్త్ స్టేడియంలో పాకిస్తాన్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే 15 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 98 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వాస్లే మదేవర్ 17 పరుగులు చేసి మహ్మాద్ వాసిమ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. క్రైగ్ ఎర్విన్ 19 పరుగులు చేసి హరిస్ రౌఫ్ బౌలింగ్‌లో మహ్మాద్ వాసిమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిల్టన్ శుంబా ఎనిమిది పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్ అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. షీన్ విలియమ్సన్ 31 పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రగిస్ చకబ్వా పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. సికిందర్ రాజా(09) పరుగులు చేసి మహ్మాద్ వాసిమ్ బౌలింగ్‌లో హరీష్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లుకే జోంగ్వే పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బ్రాడ్ ఇవాన్స్ (0), రైన్ బుర్ల్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News