Saturday, April 27, 2024

కృష్ణ మృతితో కన్నీళ్లు పెట్టుకున్న కోట శ్రీనివాసరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మరణానంతరం టాలీవుడ్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటుడు కోట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. మండలాధీశుడు సినిమాలో నటించమని కృష్ణ ప్రోత్సహించారని, అది మంచి విజయాన్ని సాధించిందని అన్నారు.

కృష్ణ సినిమాల్లో అవకాశం వచ్చిందని, కృష్ణతో దాదాపు 50 సినిమాల్లో నటించానని తెలిపారు. కృష్ణ తెల్లకాగితం లాంటివాడని, ఆయన ఎవరినీ నొప్పించలేదన్నారు. కృష్ణ మృతిని జీర్ణించుకోవడం చాలా కష్టమని కోట శ్రీనివాసరావు అన్నారు. నటుడు కృష్ణతో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News