Friday, May 10, 2024

చంద్రయాన్ 3లో కీలక దశ షురూ..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ఇప్పుడు నిర్ణీత కక్షలో సాగుతోన్న చంద్రయాన్3 ఇప్పుడు ప్రయోగానంతర కీలక ఘట్టం చేరుకుంది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలోని సాంకేతిక విభాగం నుంచి చంద్రయాన్ శాటిలైట్ ప్రయాణంపై సునిశిత పర్యవేక్షణ అనుక్షణం సాగుతోంది. ఇప్పుడు ఇది కక్షలో సవ్యంగా వెళ్లేందుకు వ్యోమనౌకలోని థ్రస్టర్లను జ్వలింప చేయడం ఆరంభించారు. ఇది ఓ క్రమపద్ధతిలో శాస్త్రీయ రీతిలో సాగుతుంది. శనివారం నుంచి ఈ ఇంధన జ్వలిత చర్యలు ఉంటాయి. దీనితో వ్యోమనౌక అనుకున్న రీతిలో భూమి పరిధి నుంచి మరింత దూరంగా వెళ్లేందుకు అవసరం అయిన శక్తిని పొందుతుంది. ప్రయోగ విజయవంతానికి ఇది అత్యంత కీలకమైన పరీక్షగా నిలుస్తుంది.శుక్రవారం శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయింది. అయితే 41 రోజుల అంతరిక్ష ప్రయాణం అత్యంత కీలకమైనది.

ఇది దాటిన తరువాత చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ ప్రయోగ సంపూర్ణ విజయానికి దారితీస్తుంది. శనివారం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ విలేకరులతో మాట్లాడారు. తొలి దశ పూర్తిగా నిర్థిష్టరీతిలో సానుకూలమైన రీతిలో ఉందని వివరించారు. ఇప్పుడు వ్యోమనౌకలోని థ్రస్టర్ల మండింపు ప్రక్రియను చేపట్టినట్లు , ఇప్పుడు వ్యోమనౌకలోని పరిస్థితులు అన్ని సవ్యంగా ఉన్నాయని, భూ కక్ష నుంచి క్రమేపీ చంద్రయాన్ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి వెళ్లితే ఇక ప్రయాణానికి తిరుగుండదని, చంద్రుడిపై సజావుగా సాగే దశలో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. చంద్రయాన్ 2 వైఫల్యాలను పరిగణనలోకి తీసుకుని సర్దుబాట్లు చేసినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News