Tuesday, April 30, 2024

ఫీవర్ ఆసుపత్రిలో రూ. 10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ ఆస్పత్రిని సందర్శించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  ఫీవర్ ఆసుపత్రిలో రూ. 10.91 కోట్లతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్ ను హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిఎంఇ రమేష్ రెడ్డి, ఐపిఎం డైరెక్టర్, ఫీవర్ హాస్పిటల్ ఇంఛార్జి శంకర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతిమీన తదితరులతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.

ఫీవర్ ఆసుపత్రిలో ఈరోజు రూ. 10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు ఇదే వేదికగా 13 హర్సే వెహికల్స్ (పరమపద వాహనాలు), 3 అంబులెన్స్ లను ప్రారంభించుకున్నామని, దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం తక్షణం 5 కోట్లు విడుదల చేశామని, ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉందని, 1915లో క్వారంటైన్ సెంటర్ గా మొదలైందని, కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచిందన్నారు.  అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుందని, ఔట్ పేషంట్ విభాగంలో రోజుకు సగటున 500-600, సీజనల్ వ్యాధుల సమయంలో 1000 వరకు వస్తున్నాయని, అందుకే కొత్త ఒపిడి బ్లాక్ ను నిర్మించుకున్నామన్నారు.  ఫీవర్ ఆస్పత్రిలో మార్చురీ అభివృద్ధికి 60 లక్షలు రూపాయలు మంజూరు చేశామని, రూ.50 లక్షలతో డయాలసిస్ వింగ్ మంజూరు చేశామన్నారు.

దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అంబులెన్స్ కోసం 5-10 వేలు ఖర్చు అయ్యేదని,  ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉచితంగా పార్థివ వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. మార్చురిలను అభివృద్ధి చేస్తున్నామని, 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు.  ఇండియాలోనే బెస్ట్ మార్చూరిలను అధ్యయనం చేసి, 9 కోట్లతో ఒయు ఆస్పత్రిలో అభివృద్ధి చేస్తున్నామని, నిన్న పార్లమెంట్ లో భారత దేశం లో ఏ రాష్ట్రాలు పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాయని, అని ఒక ఎంపి అడిగితే 3వ స్థానం లో ఉందని కేంద్రం చెప్తుందన్నారు. ప్రజా వైద్యంలో రూ. 1690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నామని,  గాంధీ, ఒయు, కోరంటి మీద లోడ్ పెరిగిందని, కాబట్టి సిఎం కెసిఆర్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు.  సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖానలు ఇవ్వలేదని,  గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే వచ్చేదని,  సిఎం కెసిఆర్ ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచారని,  దవాఖానలో మందుల కొరత ఉండొద్దన్నారు.  వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని, ఈ మేరకు త్వరలో భర్తీ చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News