Wednesday, May 15, 2024

15 రోజుల్లో హైదరాబాద్‌లో వంద శాతం వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -

100 percent Covid vaccination in Hyderabad in 15 days

హైదరాబాద్‌ను వ్యాక్సినేషన్ పూర్తయిన
నగరంగా చేసేందుకు చర్యలు
ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి
ఎంఎల్‌ఎలు, కార్పోరేటర్ల భాగస్వాములను చేయాలి
అధికారులకు సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశాలు

హైదరాబాద్ : రాబోయే పది పదిహేను రోజుల్లో హైదరాబాద్‌ను 100 శాతం కొవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి , జిహెచ్‌ఎంసి కమిషనర్, గ్రేటర్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు,డిఎంహెచ్‌ఒలు, ఎస్‌పిహెచ్‌ఒలతో బిఆర్‌కెఆర్ భవన్‌లో గురువారం నిర్వహించిన వర్క్ షాప్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడారు. నగరంలోని అన్ని కాలనీలను 100 శాతం వాక్సినేషన్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లను భాగస్వాములను చేస్తూ జిహెచ్‌ఎంసి, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సిఎస్ సూచించారు.

ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి 18 సంవత్సరాల పైబడిన అర్హత కలిగిన వ్యక్తులకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ వాక్సినేషన్‌కు మంచి స్పందన వస్తుందని సిఎస్ తెలిపారు. అదే స్ఫూర్తితో ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన వ్యక్తులకు వాక్సినేషన్ చేసేందుకు కాలనీల వారీగా టీమ్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ , జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హన్మంత రావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, సిఎం ఒఎస్‌డి డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ డిఎంహెచ్‌ఒ డాక్టర్ వెంటటి, రంగా రెడ్డి డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, మేడ్చల్ మల్కాజిగిరి డిఎంహెచ్‌ఒ డాక్టర్ మల్లికార్జున్, సంగా రెడ్డి డిఎంహెచ్‌ఒ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News