కరాచి: బలోచిస్థాన్ లోని ఉద్రిక్త నైరుతి ప్రావిన్స్‌లో ఆదివారం పాక్ షియా హజారా కమ్యూనిటీకి చెందిన 11 మంది బొగ్గు కార్మికులను దుండగులు కాల్చి చంపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మైనార్టీ కమ్యూనిటీలను లక్షంగా చేసుకుని ఈ తాజా సంఘటన జరిగింది. మాచ్ బొగ్గుక్షేత్రంలో పనిచేయడానికి వీరు వెళ్తుండగా గుర్తు తెలియని సాయుధులు వీరిని మొదట కిడ్నాప్ చేసి సమీపాన గల కొండల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, మిగతా అయిదుగురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారి లోనే ప్రాణాలు విడిచారు. ఇది ఉగ్రవాదం తాలూకు అమానవీయ పిరికి చర్యగా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్రంగా ఖండించారు. హంతకులను పట్టుకుని బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాల్సిందిగా బలోచిస్థాన్ ముఖ్యమంత్రి జామ్ కమల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు.
11 coal workers shot dead in Balochistan