Monday, April 29, 2024

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముంబైలోని ఓ హోటల్ పైన ఆదివారం నాడు ఎన్‌సిబి అధికారులు జరిపిన దాడులలో టాలీవుడ్ నటి 400 గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్స్‌తో పట్టుబడింది. నటితో పాటు డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో డ్రగ్స్ సరఫరా చేసే సయ్యద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కాగా అధికారుల సోదాలలో నటి వద్ద లభించిన 400 గ్రాముల(మెఫిడ్రిన్‌ను) డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ. 10 లక్షలవరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా గతంలోనూ డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ పైన పలు కేసులు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన నటిని, డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ అధికారులు విచారిస్తున్నారు. కాగా విచారణలో మరి కొంత మంది చిత్రపరిశ్రమకు చెందిన పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్‌సిబి అధికారులు పేర్కొంటున్నారు.
ఇంతకూ ఆ నటి ఎవరు?
ముంబైలోని ఒక హోటల్‌లో ఎన్‌సిబి అధికారులకు పట్టుబడిన ఆ నటి ఎవరు అనే విషయాన్ని అధికారులు బహిర్గతం చేయలేదు. వీరి వద్ద నిషేధిత మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ టాలీవుడ్ నటి ఎవరన్నది ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆమె గత రెండు రోజులుగా ఆ హోటల్ గదిలో ఉన్నట్టు సమాచారం.

Tollywood actress arrested in Drugs Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News